యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా పీక్ స్టేజికి చేరింది.ఇప్పుడు అంతకి మించిన క్రేజ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. సింహాద్రితో ఎంతటి సక్సెస్ అందుకున్నాడో ఆ తర్వాత తారక్ అదే స్థాయిలో ఫ్లాప్స్ కూడా చూశాడు.సింహాద్రి లాంటి రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా చేసిన చిత్రం ఆంధ్రావాలా. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆ చిత్రం హైప్ పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కి అభిమానులు తరలి వెళ్లారు. ఎంత అంచనాలతో ఆ చిత్రం రిలీజ్ అయిందో అంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.ఈ నేపథ్యంలో మామూలుగా దర్శకుడు తాను అనుకున్న విధంగా చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత మొదటగా ఆ చిత్రాన్ని చూసేది ఎడిటింగ్ చేసేటటువంటి ఎడిటర్. దీంతో ఆ ఎడిటర్ కి దాదాపుగా సినిమా ఫలితం గురించి అవగాహన వస్తుంది. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆంధ్రావాలా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా వెటరన్ హీరోయిన్ రక్షిత నటించగా సాయాజీ షిండే, రాహుల్దేవ్, బ్రహ్మానందం, వేణుమాధవ్ నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేసినటువంటి తెలుగు ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా ఆంధ్రావాలా చిత్రం ఎడిటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తన వద్దకు వచ్చి ఈ చిత్రం ఎలా ఉందని అడిగాడని దాంతో నిర్మొహమాటంగా తనకి ఈ చిత్రం నచ్చలేదని చెప్పినట్లు తెలిపాడు. అలాగే ఆంధ్రావాలా చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెటప్ ఏ మాత్రం బాగా లేదని దీనికితోడు ఎన్టీఆర్ పెద్ద వయసున్న వ్యక్తి పాత్రలో కనిపించడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయిందని తన అభిప్రాయం తెలిపాడు. దాంతో ఈ చిత్రం ఎడిటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఫ్లాప్ అవుతుందని దర్శకుడు పూరి జగన్నాథ్ తో చెప్పానని చెప్పుకొచ్చాడు.అలాగే దర్శకుడు తాను అనుకున్న విధంగా సినిమా తెరకెక్కించిన తర్వాత ఆ సినిమాని మొదటగా చూసేది ఎడిటింగ్ చేసే వ్యక్తి అని దాంతో తమకి సినిమాల ఫలితాలపై దాదాపుగా అవగాహన ఉంటుందని తెలిపాడు. అలాగే తాము ఎప్పుడూ కూడా దర్శకనిర్మాతలతో సినిమాల ఫలితాలపై అబద్దాలు చెప్పమని అందువల్లనే సినీ దర్శకులు మరియు నిర్మాతలు తన మాటలకి అంత విలువ ఇస్తారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: