మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  మహిళలపై వేధింపుల గురించి గత కొన్నేళ్ల నుంచి జస్టిస్ హేమ కమిటీ పలు రకాల విషయాల పైన పరిశీలించి గడిచిన రెండు రోజుల క్రితం రిపోర్ట్ ని కేరళ సీఎంకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరిగిందట. ముఖ్యంగా ఈ కమిటీలో అలనాటి హిరోయిన్ శారద, మాజీ ఐపీఎస్ అధికారి కె.వి వత్సల కుమారి కీలకమైన సభ్యులుగా ఉన్నారట. 2019లో ఏర్పాటు చేసిన ఈ కమిటీ సినీ ఇండస్ట్రీలో జరిగేటువంటి ఆకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు.


మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తో పాటు లైంగిక దోపిడీకి సంబంధించిన విషయాల పైన కమిటీ రిపోర్ట్ లో చాలా విషయాలు తెలియజేశారట. హేమ కమిటీ నివేదికలో ప్రకారం దాదాపుగా 55 నుంచి 56 కేజీల వరకు లైంగిక నేరాలను సైతం గుర్తించినట్లు తెలియజేశారు . మలయాళంలో సినిమా అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందనే విధంగా మారిపోయిందని కమిటీ తేల్చింది. ఇలాంటి విషయాలు బయట చెప్పిన పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా బెదిరింపులు వస్తాయని తెలియజేశారు.


అయితే లొంగని వారిని సైతం ఏదో ఒక విధంగా ముద్ర వేసి సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారని తెలిపారు. మలయాళ సినిమా ఒక మాఫియా గ్యాంగ్ కంట్రోల్ చేతిలో ఉన్నట్టుగా మారిపోయిందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా లొంగకపోతే చిత్రహింసలకు సైతం గురి చేస్తారంటూ జస్టిస్ హేమ కమిటీ తెలియజేసిందట. ఇలాంటి లైంగిక వేధింపులకు గురైన ఒక నటి సినిమా షూటింగ్లో భాగంగా కౌగిలించుకునే సన్నివేశాలలో ఒక హీరో ఈ సన్నివేశాన్ని సైతం సద్వినియోగం చేసుకోవడానికి 17 టేక్స్ తీసుకున్నారట. ఈ విషయంలో అటు డైరెక్టర్ నటుడిని సైతం తిట్టలేకపోయానని చెప్పిందట. ఉన్న తర్వాత తాము షాక్ అయ్యావని తెలిపారు.ఆ హీరోయిన్ ఈ విషయాలన్నీ కూడా హేమా కమిటీలో తెలియజేశారు. అంతేకాకుండా లొంగని వారికి సరైన ఆహారం కూడా ఇచ్చేవారు కాదని చాలామంది కూడా నగ్నంగా నటించాలని చాలా ఒత్తిడి తెస్తారని దర్శక నిర్మాతలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారని ఈ కమిటీలో రిపోర్టులో తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: