స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్కు తమిళంలో ఉన్నంత సక్సెస్ తెలుగులో లేదనేది తెలిసిందే. కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ ఇచ్చి టాప్ రేంజ్కు చేరుకున్నాడాయన. అతడు మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు డబ్బింగ్ రూపంలో ఇక్కడ చార్ట్ బస్టర్స్గా మారాయి. అయితే స్ట్రయిట్ తెలుగు మూవీస్ మాత్రం అనిరుధ్కు అచ్చిరాలేదు. ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి పలు టాలీవుడ్ ఫిల్మ్స్కు వర్క్ చేశాడీ స్టార్ కంపోజర్. కానీ మ్యూజిక్ పరంగా ఆ చిత్రాల ద్వారా అంత అప్లాజ్ అందుకోలేకపోయాడు. తెలుగులో అనిరుధ్కు పాజిటివ్ టాక్ లేదు. ఇటీవల ‘భారతీయుడు 2’తో కూడా నిరాశ పర్చాడు. కానీ ఇప్పుడు ‘దేవర’ అతడికి ధైర్యంగా మారింది.ఇంతవరకు చేసిన తెలుగు ప్రాజెక్టులేవీ అనిరుధ్కు ధైర్యం ఇవ్వలేకపోయాయి. మ్యూజిక్ పరంగానూ, సినిమాల రిజల్ట్ పరంగానూ టాలీవుడ్లో అతడికి నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు అతడిలో ధైర్యం నూరిపోస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ. ఈ సినిమా మ్యూజిక్తో తెలుగు నాట రచ్చ చేస్తున్నాడు అనిరుధ్. ‘దేవర’ నుంచి ఇటీవల వచ్చిన ‘చుట్టమల్లే’ పాట వారం లోపే 53 మిలియన్ వ్యూస్ దాటేసింది. అంతకుముందు వచ్చిన ‘ఫియర్ సాంగ్’ 47 మిలియన్లతో యూట్యూబ్ను షేక్ చేసింది. ‘దేవర’ నుంచి వచ్చిన ప్రతి సాంగ్కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది.

‘దేవర’ నుంచి వచ్చిన పాటలతో పాటు టీజర్లో బీజీఎం సౌండ్కు కూడా ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాతో అనిరుధ్కు టాలీవుడ్ సపోర్ట్, ధైర్యాన్ని ఇస్తోంది. అందుకు ఇండస్ట్రీకి, ఆడియెన్స్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అలాగే అతడితో ఇంత బాగా వర్క్ చేయించుకున్న దర్శకుడు కొరటాల శివను కూడా మెచ్చుకోవాలి. తెలుగు నాట సక్సెస్ కాలేనా? అని అతడిలో ఉన్న భయాన్ని పోగొట్టింది. ‘దేవర’ నుంచి తదుపరి రాబోయే పాటలు కూడా ఇలాగే హిట్ అయితే అనిరుధ్ టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక్కడి ఆడియెన్స్ పల్స్ను అతడు పట్టేసుకున్నాడని.. ఇదే రీతిలో ఔట్పుట్ను ఇస్తే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని చెబుతున్నారు. తెలుగు నాట అతడికి ఇది గ్రాండ్ కమ్బ్యాక్ అని అంటున్నారు.ఇదిలా ఉండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లైవ్ లో ఫియర్ సాంగ్ పాడుతుంటే వేలాదిమంది ప్రేక్షకులు ఎంజాయ్ చేసిన వీడియోను దేవర టీం షేర్ చేసింది.ప్రపంచం నలుమూలల నుంచి దేవరపై మీరు చూపుతున్న ప్రేమకు థాంక్స్ అని పేర్కొంది. అమెరికాలో జరుగుతున్న కాన్సర్ట్ లో దేవర సాంగ్స్కు వస్తున్న రెస్పాన్స్ తో అనిరుద్ వాటినే పాడేందుకు ఎక్కువగా మగ్గుచూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: