కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ల వివాహం నిన్న కర్ణాటకలోని కూర్గ్ లో గ్రాండ్ జరిగింది. వీళ్ల వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొడుతున్నాయి.పెళ్లిలో సాంప్రదాయ బద్దంగా కిరణ్ అబ్బవరం పట్టు పంచె కట్టుకుంటే రహస్య గోరక్ కూడా పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబయ్యింది. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్న వేళ తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ లకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. కిరణ్ అబ్బవరం తన పెళ్లిలో భార్యకి ఒక ఖరీదైన వస్తువుని బహుకరించినట్లు తెలుస్తోంది.మరి ఇంతకీ కిరణ్ అబ్బవరం భార్యకు ప్రేమతో ఏం గిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.. 

కిరణ్ అబ్బవరం,రహస్య గోరక్ లు ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే..వీరిద్దరూ రాజావారు రాణి గారు అనే సినిమాలో నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు.ఇక అప్పటి నుండి కిరణ్ అబ్బవరం తన సినీ  ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ రహస్య గోరక్ మాత్రం ఒకే సినిమాకి పరిమితమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుండి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అలా వీరిద్దరూ దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట పడకుండా కిరణ్,రహస్య సీక్రెట్ మెయింటైన్ చేశారు. అయితే ఆ మధ్యకాలంలో కిరణ్ తన కొత్త ఇంటి గృహ ప్రవేశంలో ఇండస్ట్రీ కి సంబంధించిన ఎవరూ కూడా కనిపించలేదు.

కానీ ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో రహస్య గోరక్ కనిపించేసరికి వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పటినుండే చక్కర్లు కొట్టింది. అలా రహస్య గోరక్, కిరణ్ అబ్బవరంలు ఎట్టకేలకు  ఎంగేజ్మెంట్ చేసుకొని తాజాగా ఆగస్టు 22న పెళ్లి పీటలెక్కారు.ఇక ఐదు సంవత్సరాల తమ ప్రేమని పెళ్లి సమయంలో అందరికీ తెలిసేలా కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరక్ కి దాదాపు కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ కిరణ్ అబ్బవరం కి భార్య అంటే ఎంత ప్రేమో అని కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: