టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న "టిల్లు స్క్వేర్" సినిమా బుల్లితెరపై కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రేక్షకుల నుండి అంచనాలు అమాంతం పెరిగాయి. రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ సినిమా ప్రేక్షకులను అంతే స్థాయిలో అలరిస్తోంది. ఇటీవల వరల్డ్

 టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది ఈ చిత్రం. ఇక అందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రానికి 7.93 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే సినిమాలోని కథ, పాత్రలు, సంభాషణలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎంతగా చర్చ జరిగిందో అందరికీ

 తెలిసిందే. సినిమాలోని కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగా నవ్వించాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. టిల్లు స్క్వేర్" సినిమా బుల్లితెరపై కూడా తన సత్తాను చాటుతుంది. ఇకపోతే ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ లో నటించగా, నేహ శెట్టి, ప్రియాంక జవాల్కర్ లు గెస్ట్ రోల్స్ లో నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ అంతే కాకుండా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: