టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ఏడాదికి నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా విడుదలై ఫ్లాప్ గా మిగిలింది.. తాజాగా RT -75 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్లో రవితేజ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో రవితేజ కుడి చేతికి గాయమైనట్టుగా సమాచారం ఈ గాయం కూడా లెక్కచేయకుండా షూటింగ్లో కంటిన్యూ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.


అయితే కుడి చేతికి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రుల రవితేజ శత్రు చికిత్స సైతం తీసుకున్నట్లుగా సమాచారం. దీంతో వైద్యులు సైతం ఒక ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారట. మిస్టర్ బచ్చన్ సినిమా డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాకు ముందు చాలా హైప్ తీసుకొచ్చిన విడుదలైన  తర్వాత ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఆర్టి 75 చిత్రంలో యాక్షన్స్ అన్ని వేషాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఇలాంటి గాయం జరిగినట్లుగా తెలుస్తోంది.


అభిమానుల సైతం ఆందోళన చెందుతున్నారు. అభిమానుల సైతం రవితేజ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఫోటోలతో షేర్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. మరి ఈ విషయం పైన రవితేజ అభిమానులకు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. చివరిగా రవితేజ ధమాకా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా ఒక మోస్తారుగా ఆడగా కొన్ని చిత్రాలు ప్లాపులుగా మిగిలాయి. రవితేజ తో నటించడానికి యంగ్ హీరోయిన్స్ సైతం సిద్ధమవుతున్నప్పటికీ కొత్త కొత్త హీరోయిన్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. త్వరలోనే రవితేజ తన కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయమంటూ అభిమానులైతే కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: