7th క్లాస్ చదువుతున్న సితార నిజంగానే ఆయన కోసం స్కూల్ బంకు కొడుతుందా.. ఇంతకీ స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న సితార ఎవరికోసం స్కూల్ బంక్ కొడుతోంది అనేది ఇప్పుడు చూద్దాం.. చిన్న వయసులోనే అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ యాడ్ లో కనిపించి సంచలనం సృష్టించింది సితార.అయితే ఇప్పటివరకు టైం స్క్వేర్ యాడ్ లో కనిపించిన అతి చిన్న వయస్కురాలిగా సితార పేరు తెచ్చుకుంది. అయితే పీఎంజే అనే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సితార అమెరికాలోని టైం స్క్వేర్ యాడ్ లో కనిపించింది.దీంతో సితార లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి సితార తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయట పెట్టింది.మీరు ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టిన సందర్భాలు ఉన్నాయా అని యాంకర్ అడగగా.. నేను చాలా సార్లు స్కూల్ బంక్ కొట్టాను.అది కూడా ఆయన కోసమే అంటూ సితార చెప్పడంతో సితార ఎవరికోసం స్కూల్ బంక్ కొట్టిందని చాలామంది ఆలోచనలో పడిపోయారు.

 అయితే సితార స్కూల్ బంకు కొట్టింది ఎవరికోసం కాదు తన తండ్రి మహేష్ బాబు కోసమే.. మహేష్ బాబుకి సితార అంటే చాలా ప్రాణం. ఆమెని చిన్నప్పటినుండి ఎంతో గారాబంగా పెంచాడట.అలాగే సితార క్యూట్ మాటలు అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమట. అంతేకాదు ఆయనకు షూటింగ్స్ లేకపోతే సీతార ను ఇంటి దగ్గరే ఉండమని ఆమెతో టైం స్పెండ్ చేస్తాడట.ఇక మహేష్ బాబు టైం దొరికినప్పుడల్లా తరచూ విదేశాలకు వెకేషన్స్ కి వెళ్తాడు అన్న సంగతి మనకు తెలిసిందే.ఇక మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళిన ప్రతిసారి తన కుటుంబాన్ని కచ్చితంగా వెంట తీసుకొనే వెళ్తారు.అలా వెకేషన్ కి వెళ్ళిన సమయంలో సితార ప్రతిసారి తన స్కూల్ బంక్ కొట్టాల్సి వస్తుంది. ఇక ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో సితార చెబుతూ మా నాన్న వల్ల నేను స్కూల్ చాలాసార్లు బంక్ కొట్టాను అని సితార ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

 అయితే  మహేష్ బాబు ఎక్కువగా షూటింగ్స్ లో గ్యాప్ దొరికితే విదేశాలకు టూర్లు వేస్తాడు. కాబట్టి ఈ వెకేషన్స్ కారణంగానే సితార తండ్రి కోసం చాలాసార్లు స్కూల్ బంక్ కొట్టింది కావచ్చు అని అందరూ భావిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ సితార తండ్రికి తగ్గ తనయురాలిగా ఘట్టమనేని పేరు ఇండస్ట్రీలో నిలబెడుతోంది. ఇప్పటికే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న సితార మరో రెండు మూడు సంవత్సరాలకు మరింత అందంగా తయారవుతుంది. అంతేకాదు ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం చేసినా కూడా చాలామంది ఈమె అందానికి అట్రాక్ట్ అవుతారు. మరి మహేష్ బాబు సినిమాల్లోకి తన కూతుర్ని తీసుకువస్తారా లేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: