మెగా ఫ్యామిలీలోకి క్లింకార ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుండి మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయి.. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్,వరుణ్ తేజ్ లైఫ్ లో ఊహించని ఎన్నో విశేషాలు జరిగాయి. అలా ప్రస్తుతం క్లింకార రాక వారికి ఒక అదృష్టంగా మారిపోయింది. అయితే అలాంటి క్లింకార ను పెంచడంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె కోసం ఇప్పటినుండే ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే అలాంటి రామ్ చరణ్ తన కూతురు క్లింకారాకి ప్రేమతో తాజాగా ఒక అదిరిపోయే బహుమతి ఇచ్చారట.. ఇక రామ్ చరణ్ ఇచ్చిన బహుమతి నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది రామ్ చరణ్ కి కూతురు మీద ఉన్న ప్రేమకి ఫిదా అవుతున్నారు. మరి ఇంతకీ రామ్ చరణ్ తన కూతురికి ఇచ్చిన ఆ అదిరిపోయే గిఫ్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

సెలబ్రిటీల ఇంట్లో ఏదైనా సరే చాలా లగ్జరీగా ఉంటుంది.అలా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తన కూతురుకి ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట. అదేంటంటే గుర్రం.. అవును మీరు వినేది నిజమే.  రామ్ చరణ్ మగధీర సినిమా చేసే సమయంలో గుర్రపు స్వారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సమయంలో బాద్ షా అనే గుర్రంతో చరణ్ కి మంచి బాండింగ్ ఏర్పడిందట.అలా మగధీర సినిమాలో బాద్ షా గుర్రం మీద రామ్ చరణ్ స్వారీ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరీ ఆ గుర్రాన్ని తాను తీసుకువెళ్తాను అని చరణ్ చెప్పారట. దాంతో రామ్ చరణ్ కి ఆ గుర్రాన్ని రాజమౌళి ఇచ్చేసారట.

అలా మగధీర సినిమా షూటింగ్లోని బాద్ షా గుర్రం ఇప్పటికి కూడా తన ఫామ్ లోనే ఉందట.ఇక బాద్ షా గుర్రాన్ని రామ్ చరణ్ చాలా ప్రేమగా చూసుకుంటారట.అయితే ఈ మధ్యనే ఆ బాద్ షా గుర్రానికి ఒక చిన్ని గుర్రం పుట్టిందట. అయితే ఆ చిన్ని గుర్రాన్ని తన కూతురు క్లింకారాకి గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారట రామ్ చరణ్.. క్లింకారా చాలా చిన్నమ్మాయి కాబట్టి ఆమెకు నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్.. నేను ఆమెతో పంచుకునే అభిరుచి ఇదే అంటూ రామ్ చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ని తెగ పొగిడేస్తున్నారు.కూతురు మీద నీకు ఉన్న ప్రేమకి మేం పడిపోయాం అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: