ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అశ్వని దత్ అల్లుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టి మరింత క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత మహానటి సినిమా తీయడంతో భారీ సక్సెస్ అయ్యారు. కల్కి సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాయిని మరొకసారి పాపులారిటీ అయ్యేలా చేసింది. ఇటీవల కాలంలో మరి కొంతమంది దర్శకుల తలరాతలను సైతం మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో ఇద్దరు దర్శకుల పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఒకరు జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ సక్సెస్ కావడానికి నాగ్ అశ్విన్ కారణమట. మొదట అనుదీప్ పిట్టగోడ అనే చిత్రాన్ని చేశారట కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మరెవరు అవకాశం ఇవ్వలేదు.
అలా ఖాళీగా ఉంటున్న సమయంలో నాగ్ అశ్విన్ అతడిని పిలిపించి తన షార్ట్ ఫిలిం లను చూసి ఎప్పటికైనా అతనితో ఒక సినిమా నిర్మించాలని జాతి రత్నాలు అనే సినిమాతో అతనికి అవకాశం కల్పించారు. ఈ సినిమా కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ చేయగ పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం అయితే విశ్వక్ తో ఒక సినిమాని చేయబోతున్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి. గతంలో ఈయన తెరకెక్కించిన లై, పడి పడి లేచే మనసు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయాయి. అలాంటి సమయంలో అతడిని పిలిచి అవకాశం ఇప్పించి సీతారామం సినిమాని స్వప్న బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమాతో హనురాగవపూడి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాని చేస్తున్నారు.