ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన గొడవలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఇంత దూరం ఎందుకు పెరిగింది.. అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులపై అలా పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇవ్వడానికి కారణం ఏంటి అని చాలామంది తలలు బాదుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ కుటుంబంలో ఒక్కసారిగా గొడవలు వచ్చేసరికి చాలామంది వీరి అభిమానులు బాధపడుతున్నారు.అయితే కొంతమంది మాత్రం వీరి మధ్య గొడవ ఉందో లేదో తెలియదు కానీ దీన్ని కాంట్రవర్సీ అయ్యేలా కొంతమంది పోస్టులు పెడుతున్నారు.అయితే మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ అవమానించడం కాదు అల్లు ఫ్యామిలీనే మెగా ఫ్యామిలీ,ఫ్యాన్స్ అవమానించారు అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్లో అల్లు అరవింద్ స్టేజ్ పై మాట్లాడడానికి ప్రయత్నించాడు.కానీ ఆయన మైక్ పట్టుకోగానే అక్కడే ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ మీరు మాట్లాడవద్దు అంటూ చేతులతో సైగలు చేశారు. అయితే ఆయన ఏదో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలి అనుకున్నారు. అంతేకాదు ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలోని చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ కి కూడా ఈ రహస్యం తెలియదు అది మీకు ఇప్పుడు చెబుతాను అని అల్లు అరవింద్ అన్నారు. కానీ ఆయన మైక్ పట్టుకొని బతిమిలాడినట్టు మాట్లాడినా కూడా మెగా ఫ్యాన్స్ వద్దు వద్దు అంటూ చేతులు ఊపడంతో అల్లు అరవీంద్ కాస్త అవమానంగా ఫీల్ అయ్యారు.

అయితే అక్కడే ఉన్న రామ్ చరణ్ గానీ చిరంజీవి గానీ పవన్ కళ్యాణ్ గానీ కనీసం నోరు విప్పలేదు.అయితే చిరంజీవి ఆగండి అన్నట్లు సైగ చేశారు కానీ అది మైక్ పట్టుకొని గట్టిగా తన ఫ్యాన్స్ కి చెప్పలేదు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవ్వడంతో అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాతకు స్టేజ్ పై అవమానం జరగడంతో ఈ అవమానాన్ని దృష్టిలో పెట్టుకున్న బన్నీ తన తండ్రి కి జరిగిన అవమానం భరించలేక ఇలా మెగా ఫ్యామిలీని దూరం పెట్టాడని,ముందుగా అవమానించింది మెగా ఫ్యాన్స్,మెగా ఫ్యామిలీ అని సోషల్ మీడియాలో ఈ వీడియోని తెగ సర్క్యూలేట్ చేస్తున్నారు కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: