అందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ వారు ఒక వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత అభిమానులైతే కావాలని రన్ టైం పెంచడం ఎందుకు మళ్లీ అలాంటి తప్పే చేస్తున్నారుకా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అంటే సుందరానికి!, సరిపోదా శనివారం రెండు సినిమాలకు కూడా డైరెక్టర్ వివేకాత్రేయ రూపొందించారు. అంటే సుందరానికి సినిమా బాగున్నప్పటికీ ఎక్కువ సమయం నిడివి ఉండడం వల్ల ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసింది.
ఇక అంటే సుందరానికి, సరిపోదా శనివారం సినిమాకి కేవలం 6 నిమిషాల వ్యత్యాసంతోనే నిడివి కలదట. వారానికి ఏడు రోజులు కాగా మిగిలిన ఆరు రోజులు ప్రశాంతంగా ఉండే హీరో శనివారం రోజు ఎందుకు కోపం ప్రదర్శిస్తారనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా, హాయ్ నాన్న వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ఫ్యాక్టరీకి అందుకుంటారేమో చూడాలి. సరిపోదా శనివారం రాంగ్ టైం విషయానికి వస్తే సుమారుగా 170 నిమిషాల 50 సెకండ్లు కలదట.. దీన్నిబట్టి చూస్తే సుమారుగా మూడు గంటల పాటు ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఎస్ జె సూర్య కూడా కీలకమైన పాత్ర వ్యవహరిస్తున్నారు.