పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత కొంత కాలం పాటు సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాల పైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సినిమాలకు దూరం కానున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆయన అలా ప్రకటించడంతో ఆయన అభిమానులు లేటుగా అయినా మంచిదే ఎప్పుడైనా ఒక సినిమా అయినా చేయండి మొత్తంగా సినిమాలు మానేయకండి అని పెద్ద ఎత్తున ఆయనను కోరారు. దానితో ఆయన కూడా త్వరగా పూర్తి అయ్యే కొన్ని సినిమాలను చేస్తూ వచ్చాడు.

ఇక 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో జనసేన పార్టీ , తెలుగు దేశం బిజెపి తో కలిసి పొత్తుల భాగంగా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇలా ఈయనపై ఇప్పుడు అత్యంత బరువు బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్లకి ముందు కొన్ని సినిమాలను ఒప్పుకున్నాడు. ఆ సినిమాలను పూర్తి చేసి పవన్ మళ్ళీ సినిమాల వైపు చూడడు అనే సంకేతాలే వినిపిస్తున్నాయి.

దానితో ఆ మూవీ లకు సంబంధించిన నిర్మాతలు వరుసగా పవన్ ను కలుస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా కూడా వీలైనంత త్వరగా తమ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు సినిమాలకు కమిటీ అయి ఉన్నాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన కొత్త భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: