ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు ప్రతి వారం ఏదో ఒక భాషలో కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. అలాగే ఇందులో ఉండే కంటెంట్ కూడా చాలా క్వాలిటీ తో ఉండడం వల్ల ఇప్పటికే ఎంతో మంది భారతీయులు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ కు అలవాటు పడిపోయారు . ఇకపోతే ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ఏదో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం అత్యధిక మంది నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్  లో చూసిన సినిమాలలో మహారాజా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం ఏ సినిమాకు దక్కనన్ని వ్యూస్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహారాజా సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది .

అలాగే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని విజయ్ సేతుపతి నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకునే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: