సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అనేది ఆ నటులకు ఉన్న క్రేజ్ ను బట్టి ఉంటుంది. నటులకు అద్భుతమైన క్రేజ్ ఉన్నట్లు అయితే వారికి రెమ్యూనరేషన్ అధికంగా ఉంటుంది. అదే నటులకు పెద్ద స్థాయిలో క్రేజ్ లేనట్లయితే వారికి రెమ్యూనిరేషన్ పెద్ద స్థాయిలో ఉండదు. ఇకపోతే కొంత మంది నటులు సినిమా మొత్తానికి ఇంత అని తీసుకుంటే మరి కొంత మంది నటులు మాత్రం రోజు వారిగా తమ రెమ్యూనరేషన్ ను తీసుకుంటూ ఉంటారు. దాదాపుగా సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటించే వారు సినిమాకు ఇంత అని తీసుకుంటారు.

కానీ సినిమాలలో కీలక పాత్రలలో నటించే క్రేజ్ ఉన్న నటులు మాత్రం దాదాపుగా రోజుకు ఇంత అని తీసుకుంటారు. ఎందుకు అంటే వారు సినిమా మొత్తం వారు భాగం కారు. సినిమాలో కీలకమైన పాత్ర కావడం వల్ల వారు కొంత సమయం మాత్రమే సినిమాలో కనిపిస్తారు. అందువల్ల వారు రోజుకు ఇంత అనే తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే కొంత కాలం క్రితం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా కోసం ఈయన భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర దాదాపు 8 నిమిషాల నిడివితో ఉంటుంది. ఈ 8 నిమిషాల నిడివి కల పాత్ర కోసం అజయ్ దేవగన్ ఏకంగా 35 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈయనకు ఉన్న క్రేజ్ కి ఇది పెద్ద రెమ్యూనరేషన్ ఏమీ కాదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad