సినిమాలలో కొన్ని యాక్షన్ సన్నివేశాల విషయంలో హీరోలు అత్యంత కష్టపడుతూ ఉంటారు. కొంత మంది హీరోలు యాక్షన్స్ అన్ని వేషాల సమయంలో వారు కాకుండా తమ డూప్ తో సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ మరి కొంత మంది మాత్రం ఎంత కష్టం అయినా సరే డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా డూప్ లేకుండా యాక్షన్స్ సన్నివేషాలు చేసినట్లు అయితే కొన్ని సందర్భాలలో గాయాలు తగిలే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. అలాగే మంచి క్రేజ్ ఉన్న హీరోలు ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు అంటే దర్శకులకు కూడా భయం ఉంటుంది.

ఎందుకంటే వారికి ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయా అనే భయం వారికి ఉంటుంది. అందువల్ల వారు కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కొంత కాలం క్రితం అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి వక్కంతం వంశీ స్టోరీని అందించాడు. హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కోసం అఖిల్ తో పాటు ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సురేందర్ రెడ్డి కూడా చాలా కష్టపడ్డాడట.

మూవీ యాక్షన్ సన్నివేశాల విషయంలో అఖిల్ తో పాటు సురేందర్ రెడ్డి కి కూడా గాయాలు అయ్యాయట. అయిన కూడా సినిమా అద్భుతంగా రావడం కోసం వీరేంతో కష్టపడ్డారట. అలా ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమా ఇటు అఖిల్ కి కానీ , అటు సురేందర్ రెడ్డి కి కానీ గొప్పకు పేరును తీసుకురాలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: