మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇక తెలుగులో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపింది. అందులో భాగంగా ఈమె తమిళ ఇండస్ట్రీ లో నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను సాధించడంతో ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

ఇకపోతే ఇప్పటికే కూడా ఈమె తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే మళ్లీ ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమాలో కూడా త్రిష హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందిబోయే స్పిరిట్ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష కు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: