తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నారు . అలాంటి వారిలో కొంత మంది అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి . లేదంటే వారి కెరియర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. అలా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న ఆ కొద్ది మంది హీరోలు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో రవితేజ అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆఖరుగా ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ తో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరోగా రూపొందిన ది వారియర్ , స్కంద తాజాగా విడుదల అయిన డబల్ ఇస్మార్ట్ మూడు సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

దానితో ఈ నటుడు కూడా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా సూపర్ గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ కూడా ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన కూడా అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఈ నటుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో గోపీచంద్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి. టాలీవుడ్ యువ నటుడు నితిన్ కూడా వరుస అపజయాలను అందుకుంటున్నాడు. దానితో ఈయన కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన హీరోల లిస్టులో చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: