ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల కు వదిన, అక్క క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీ లో ఉండడానికి ప్రయత్నిస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై గత కొద్ది రోజులుగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. భూమిక తన భర్త తో విడాకులు తీసుకోబోతుందని.. భూమిక భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్టు టాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం గురించి భూమిక ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి బెక్కం వేణుగోపాల్ ని అడగగా.. అలాంటిదేమీ లేదు.

భూమికా భరత్ ఠాగూర్ లు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ విడాకులు తీసుకోరు అని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ  ఈ వార్తలు ఆగలేదు.దాంతో ఓ రోజు బెక్కం వేణు గోపాల్ నేరుగా భూమిక ఇంటికి వెళ్లి ఈ వార్తలపై స్పందించొచ్చు కదా అని అడగగా..పనికిమాలిన వాళ్ళు చేసే ప్రచారాలకు మనం పని కట్టుకొని వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇద్దరం అన్యోన్యంగా ఉంటే చాలు బయట ఎన్ని రూమర్స్ వినిపించినా మాకు అనవసరం అంటూ భూమిక చెప్పిందట.

ఇదే విషయాన్ని బెక్కం వేణుగోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే భూమిక మీద వినిపించిన రూమర్ ఏంటంటే.. భూమిక భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుందని కానీ వీరి విడాకుల మ్యాటర్ టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించడంతో సినీ నటుడు నాగార్జున వెళ్లి వారి మధ్య సంధి కుదిర్చారు అనే పుకారు వచ్చింది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని బెక్కం వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: