ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సెలవుల్లో సితార నమ్రత గౌతమ్ లోతో కలిసి చాలా క్వాలిటీ టైం గడుపుతున్నారు. అంతేకాకుండా లేటెస్ట్ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు. హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం కొత్తగా ఒక రఫ్‌ లుక్‌లో కనిపించే అందర్నీ ఆశ్చర్యపరిచారు. చాలామంది ఆయన నెక్స్ట్ సినిమా  కోసం ఈ లుక్‌ పొందారేమో అని అనుకుంటున్నారు. మహేష్ నెక్స్ట్ మూవీని దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా రెండు కొత్త రూమర్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు నటించనున్న నెక్స్ట్ సినిమాకి SSMB29 వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ మూవీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఈ సినిమా ఏ రకమైన కథా చిత్రం అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కొందరు అది ఆఫ్రికా నేపథ్యంలో తెరకెక్కుతున్న సాహస చిత్రం అని అనుకుంటున్నారు. అయితే, రాజమౌళి గత కొన్ని సంవత్సరాలుగా 'గరుడ' కథను డెవలప్ చేస్తున్నారని ఆ స్టోరీ తోనే మహేష్ సినిమా రాబోతోందని మరికొంతమంది భావిస్తున్నారు. జానర్ ఏంటో చెప్పిన బాగుంటుందని మహేష్ ఫ్యాన్స్ రాజమౌళిని బాగా అడుగుతున్నారు ఆయన దాన్ని సీక్రెట్ గానే ఉంచారు.

ఈ సినిమాతో సంబంధం ఉన్న కొంతమంది మాత్రం  SSMB29 సినిమా 'గరుడ' కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండూ వేర్వేరు సినిమాలే అని పేర్కొంటున్నారు. అంటే, మహేష్ బాబు నటిస్తున్న సినిమా 'గరుడ' కాదు, ఇంకో కొత్త కథ అని అర్థం. మహేష్ బాబు సినిమా ఆఫ్రికా అడవుల్లో సాగే ఒక అడ్వెంచర్ ఫిల్మా? అంటే అది కూడా ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.

సోషల్ మీడియాలో ఈ సినిమా 2028లో విడుదల అవుతుందని చాలా మంది పుకార్లు సృష్టిస్తున్నారు. కానీ, ఇది ఇంకా ఖాయం కాలేదు. సినిమా బృందం ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన పనిలో ఉందని సమాచారం. అంటే వర్క్స్ మొదలయ్యాయి కాబట్టి ఈ మూవీ మరీ 2028కి వాయిదా పడకపోవచ్చు. అంత సింగ సినిమా తెరకెక్కించడం కూడా మైనస్ అవుతుంది. ఈ సినిమా గురించి అధికారికంగా ఏదైనా తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: