టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ షూటింగ్‎లో గాయపడ్డారు. నూతన డైరెక్టర్ భోగవరపు భాను దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆర్టీ 75 అనే వర్కింగ్ టైటిల్‎తో ఓ మూవీ తెరకెక్కుతోంది.ప్రస్తుతం హైదరాబాద్‎లో ఈ మూవీ యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రవితేజకు గాయమైనట్లు సమాచారం. కుడి చేతి కండరం చిట్లడంతో మూవీ యూనిట్ రవితేజను యశోదా ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. వైద్యులు సర్జరీ చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. కనీసం ఆరు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు రవితేజకు సూచించినట్లు తెలుస్తోంది.రవితేజ షూటింగ్‎లో గాయపడ్డట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న ఈ తరుణంలో.. రవితేజకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో.. ఐసీయూలో రవితేజకు వైద్యులు నోట్లో పైపులు పెట్టి చికిత్స అందిస్తుండగా.. మరోవైపు హీరో చేతికి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''రవితేజకు అంత తీవ్ర స్థాయిలో గాయం కాలేదని' కొందరు.. 'అది మూవీ షూటింగ్‎లో తీసిన ఫొటో'' అని మరికొందరు.. 'అసలు ఆ ఫొటో నిజమేనా' అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

గాయానికి గురైన తమ అభిమాన నటుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే, రవితేజ గాయంపై గానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోపై కానీ హీరో టీమ్ నిన్నటి వరకు అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. మరీ రవితేజ నిజంగా గాయపడ్డారా లేదా అన్న విషయం ఆయన అభిమానుల్లో కలకలం రేపుతుంది.ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజ రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. సాఫీగా సాగిన సర్జరీ అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను.తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు చేసిన వారందరికి ధన్యవాదాలు అంటూ రవితేజ రాసుకోచ్చాడు. ఇదిలా ఉండగా మాస్ మహారాజా రవితేజ గాయం పై ఆయన పిఆర్ టీం అప్డేట్ ఇచ్చింది.75వ సినిమా షూటింగ్ కోసం యాక్షన్ సీన్స్ చేస్తుండగా రవితేజ కుడి చేతికి గాయం అయింది.కండరం చిట్లినా లెక్కచేయకుండా షూటింగ్ చేయడంతో గాయం పెద్దదయింది. గురువారం ఆయనకు సర్జరీ విజయవంతమైంది. గాయం తగ్గడానికి ఆరువారాలు పడుతుంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అని పేర్కొంది.సర్జరీ అనంతరం రవితేజ ఇంటికి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: