టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతనికి చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు నేలమట్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో నాగార్జునకు N కన్వెన్షన్ సెంటర్‌ ఉంది. అయితే అది ఒక అక్రమ కట్టుడు అని దాన్ని కూల్చేశారు. ఈ వార్త చాలామందికి షాక్ ఇచ్చింది. నాగార్జున బాగానే ఇతర సినిమా సెలబ్రిటీలు కూడా అక్రమ కట్టడాలు కట్టుకున్నారా? నెక్స్ట్ ఏ హీరో అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేయనున్నారు అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

హైడ్రా పేరుతో తెలంగాణలో ఒక వ్యవస్థ అనేది ఏర్పాటయింది. దీని ఫుల్ ఫామ్ 'హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ'. ఇప్పుడు హైడ్రా పేరు వింటే భాగ్యనగరంలోని భూకబ్జాదారులు, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. సినీ సెలబ్రెటీలు ఇలాంటి జాబితాలో ఉంటే వారికి కూడా షాకులు తగులుతాయి.

ఇటీవల కాలంలో భారతదేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఎక్కువైపోయాయి. గురించి గొప్పలు తప్పలుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ దందాను రియల్ ఎస్టేట్ కంపెనీలు, రాజకీయ నేతలే నడిపిస్తారని ఆరోపణలు నిత్యం వినిపిస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అస్సలు సహించడం. అందుకే ఇలాంటి దందాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణం తెలిస్తే చాలు వాటిని కూల్చివేస్తుంది. హైడ్రా ఏజెన్సీకి దీనికి హెడ్ ఐజీ రంగనాథ్‌. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే దీంతో అక్రమార్కుల్లో టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్లు గెలుస్తోంది.

ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జులైలో హైడ్రా ఏజెన్సీకి 259మంది ఆఫీసర్లు.. సిబ్బందిని కేటాయించారు. ఇందులో ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్1 స్థాయి ఎస్పీయేలు, ఐదుగురు డిప్యూటీ సూపరింటెండెంట్స్, 21 మంది ఇన్‌స్పెక్టర్స్‌, 33 మంది ఎస్సైలు, 12 మంది రిజర్వ్ ఎస్సైలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోమ్ గార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను ఉన్నారు. ఇప్పుడు వీరందరూ కలిసి అక్రమార్కుల, భూకబ్జాదారుల భారతం పడుతున్నారు.

హైడ్రా ముఖ్య లక్షణం ఏమిటంటే.. అనుమతి లేకుండా కట్టిన కట్టడాలు, కబ్జా చేసిన భూమిలో కట్టిన నిర్మాణాలను లేదా చెరువులను ఆక్రమించిన భవనాలను కూలగొట్టడమే! ఇక హైడ్రా చీఫ్‌ ఆఫీసర్ ఏవీ రంగనాథ్‌ ఇంతకుముందు ఎంతోమంది క్రిమినల్స్‌కు చెమటలు పట్టించారు. మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్‌కు చుక్కలు చూపించారు. రంగనాథ్‌ దేనికి భయపడరు. అప్పజెప్పిన పనిని కరెక్టుగా పూర్తి చేస్తారు అందువల్ల హైడ్రా లక్ష్యం నూటికి నూరు శాతం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

మరి నెక్స్ట్ ఎవరు?

నాగార్జున ఒక్కరికి మాత్రమే కాదని, చాలా మంది తెలుగు హీరోలకు హైదరాబాద్ సిటీలో అక్రమకట్టడాలు ఉన్నాయని ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తోంది. అయితే కట్టడం హీరోదా కాదా వంటి వాటితో సంబంధం లేకుండా అన్నిటిని కూల్చేయడమే జరుగుతుంది. ప్రజలు ఈ చర్యను సంతోషంగా స్వాగతిస్తున్నారు. ఇలాంటి కట్టడాలు పోతేనే సిటీ బాగుంటుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవని పేర్కొంటున్నారు. నెక్స్ట్ ఎవరి ప్రాపర్టీ నేలమట్టమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: