ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే తమిళుల జీవితంలో ఈ చెట్టు ఒక భాగంగా మారిపోయిందట. ఈ చెట్టు సైతం గాలిలో ఉండేటువంటి విషపదార్థాలను పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందట. ఈ చెట్టు ఎలాంటి చోట అయినా సరే పెరుగుతుందని.. ఈ చెట్టు నుంచి వచ్చే కలప కూడా ఇంటికి చాలా ఉపయోగపడుతుందట. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పువ్వు వల్ల ఎన్నో రకాల జబ్బులను సైతం నయం చేసుకోవచ్చట.
వాగై పువ్వు కంటి వ్యాధులను కూడా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. వాగై పువ్వు ద్వారా చేసుకుని తాగేటువంటి టీ తో చాలా ఔషధ గుణాలు లభిస్తాయి. మన శరీరంలో ఉండేటువంటి విషవాయువుని సైతం తొలగించడానికి ఈ టీ చాలా ఉపయోగపడుతుందట. వాగై పువ్వులతో మొగ్గలతో చేసేటువంటి కారంపొడిని నీటిలో మరిగించి చల్లార్చి తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ల నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట. ఇలా తన జెండాలోని ఎన్నో వాటికి ఈ పువ్వు వల్ల ఉపయోగాలు ఉన్నాయని విజయ్ దళపతి ప్రత్యేకించి మరి తన జెండాలో ఈ పువ్వుని ఉంచినట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి పొలిటికల్గా విజయ్ ఏవిధంగా సక్సెస్ అవుతారో చూడాలి.