ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అందరి నోటా ఒకే పాట వినిపిస్తుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ నుంచి విడుదలైన చుట్ట మల్లే సాంగ్. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివతో దేవర అనే మూవీ చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అటు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపద్యంలో ఈ సినిమా నుంచి చిత్రబృందం ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఉంది. అయితే ఇటీవలే చుట్టమలే అనే సాంగ్ విడుదలవ్వగా ఇక ఈ సాంగ్ అటు సోషల్ మీడియాను షేక్ చేసేసింది అని చెప్పాలి. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సాంగ్ తెగ నచ్చేసింది. యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్ గా మారిపోయింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా చుట్టమల్లే సాంగ్ మేనియా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.


 కాగా ఈ పాటకు లిరిక్స్ ని ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి అందించారు. అయితే ఈ పాటకు మరో వెర్షన్ నూ ఇటీవలే పాడి వినిపించారు రామ జోగయ్య శాస్త్రి. ముందుగా చుట్టమల్లే సాంగ్ కోసం రాసిన మరో లిరిక్ వెర్షన్ రచయిత రామ జోగయ్య శాస్త్రి పాడి వినిపించారు. డైరెక్టర్ కొరటాల శివ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుమతితో తన ఆనందాన్ని ఇలా సోషల్ మీడియాలో పంచుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలా చుట్ట మల్లే సాంగ్ కి మరో వెర్షన్ ను అటు రామ జోగయ్య శాస్త్రి పాడి వినిపించగా ఈ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: