సాధారణంగా సినిమా హీరోలకు సంబంధించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున పేరు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దీనికి కారణం నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడమే. ఏకంగా చెరువులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలు అన్నింటిపై కూడా హైడ్రా కొరడా ఝాలిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా అక్రమ కట్టడాలు చేపట్టింది ఎంతటి వారు అయినా సరే ఉపేక్షించేది లేదు అన్న విధంగానే హైడ్రా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో ఉన్న హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేసింది. అయితే ఈ విషయంపై అటు నాగార్జున కోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ విషయంపై స్టే విచించినప్పటికీ.. అప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇక ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కారణంగా వార్తల్లో నిలిచిన నేపథ్యంలో.. ఈ కన్వెన్షన్ సెంటర్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. సాధారణ కన్వెన్షన్ సెంటర్లకే లక్షల్లో ఈ మధ్యకాలంలో అద్దె తీసుకోవడం చేస్తూ ఉన్నారు. అలాంటిది హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అద్దె ఎంత ఉంటుంది అన్న విషయం తెలుసుకున్నందుకు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అయితే ఇందులో అదే దాదాపు 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో 37,000, 27000, 7000, 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్ లు ఉంటాయట. ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు గెట్ టుగెదర్ పార్టీలు ఇందులో జరుపుకుంటారట. అయితే ఈ కన్వెన్షన్ సెంటర్ ఉన్న ప్రాంతంలో ఎకరా విలువ 100 కోట్ల విలువ చేస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: