తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన ‘సర్ధార్’ తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్ధార్ 2’ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పీఎస్ మిత్రన్. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రజెంట్ చెన్నైలో భారీ సెట్స్‌లో స్టార్ట్ అయింది. ప్రిన్స్ పిక్చర్స్‌పై ఎ. వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. సోమవారం (జులై 15) నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోన్న క్రమంలో ఎజుమలై అనే ఫైట్‌ మాస్టర్‌ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే స్పందించిన చిత్రబృందం అతనిని ఆస్పత్రికి తరలించింది. అయితే అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం.దీనికరణంగా షూటింగ్ వాయిదా వేశారు.తాజాగా సర్దార్ షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభించింది. ‘సర్దార్ 2’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన‌ట్లు చెన్నై సినీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ వేడుక కోసం చెన్నైకి వచ్చిన మాళవిక మోహనన్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ ఎజుమలై క‌న్నుముశాడు. దీంతో కొన్ని రోజులు వాయిదా ప‌డిన షూటింగ్ మ‌ళ్లీ నిన్న‌టి నుంచి స్టార్ట్ అయిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.మ‌రోవైపు కార్తీ ప్ర‌స్తుతం మేయాల‌గ‌న్ అనే సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయిన అనంత‌రం సర్దార్ 2లో పాల్గోన‌బోతున్న‌ట్లు స‌మాచారం. అప్ప‌టివ‌ర‌కు కార్తీ లేని సీన్స్‌ను షూటింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో కార్తీతో పాటు ఎస్.జె.సూర్య, మాళవిక మోహనన్, రజిషా విజయన్, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.

మరింత సమాచారం తెలుసుకోండి: