తెలుగు చిత్ర సీమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం ఇందులో ఈనటి నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో మొదటి మూవీ తోనే ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

అందులో భాగంగా ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆఖరుగా ఈ బ్యూటీ మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందబోయే సినిమాలో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ వచ్చినట్లు , దానిని ఈమె రిజక్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశారంట నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి ఈ బ్యూటీ సమాధానం ఇస్తూ ... నన్ను ఇప్పటి వరకు చిరంజీవి సినిమా కోసం ఎవరు అడగలేదు. చిరంజీవి తో సినిమా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. అలాంటి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని ఈ బ్యూటీ సమాధానం ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks