మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం ధమాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత రవితేజ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇక ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడానికి రెడీ గా ఉన్న ఈ సినిమా మరి కొంత కాలంలోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రవితేజ కు మరో పరీక్ష మొదలైంది.

ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కోబోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఓ టీ టీ లో నైనా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే రవితేజకు కాస్త ఊరట ఉంటుంది. ఓ టీ టీ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రానట్లయితే రవితేజ కు ఈ సినిమా ద్వారా మరిన్ని కష్టాలు ఉండే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: