కొంత మంది హీరోలు వరు స విజయాలతో ఫుల్ సక్సెస్ లో కెరియర్ ను కొనసాగిస్తున్న వారి తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపి స్తూ ఉంటారు . ఎందుకు అంటే వారు మంచి విజయాలు అందుకుంటున్నారు కాబట్టి మళ్లీ విజయం అందుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు . లేక పోతే సినిమా సెట్ కావడంతోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరుగుతాయి అనే ఉద్దేశం కూడా అయి ఉండవచ్చు . ఇక సినీ పరిశ్రమ  లో కొంత మంది హీరోలు మాత్రం ఫ్లాప్ లలో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంటారు . అలాంటి వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు.

ఆయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం రామ్ పోతినేని "ఇస్మార్ట్ శంకర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే ముందు పూరి జగన్నాథ్ వరుస అపజాయలతో డీల పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇకపోతే రామ్ పోతినేని ,  తన నెక్స్ట్ మూవీ ని హరీష్ శంకర్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. హరీష్ శంకర్ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ ఈ దర్శకుడికి రామ్ అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ , హరీష్ శంకర్ తో కూడా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: