బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అమీర్ ఖాన్ కెరియర్ లో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో లగాన్ మూవీ ఒకటి. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇకపోతే ఈ సినిమాకు అషుతోష్ గోవారికల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది.

ఇకపోతే ఈ సినిమాలో లాకా పాత్రలో నటించిన యష్ పాల్ శర్మ తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా లగాన్ సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... లగాన్ కథను పెద్దగా ఎవరూ నమ్మలేదు. కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఇక ఈ మూవీ లో హీరో దోతి , పగ్డి ధరించడం కూడా కొంత మంది కి నచ్చలేదు. దానితో కూడా ఈ స్క్రిప్ట్ ను కొంటంది రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ కథ మొదట గా హృతిక్ రోషన్ వద్దకు వెళ్ళింది. ఆయన ఈ సినిమా కథకు అంగీకారం తెలపలేదు. ఇక ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు ఈ సినిమా కథను ఆమీర్ ఖాన్ కు వినిపించడం , ఆయనకి ఈ స్టోరీ అద్భుతంగా నచ్చడం , ఈ కథతో సినిమా రూపొందిస్తే అద్భుతమైన విజయం సాధిస్తుంది అని నమ్మడం జరిగింది.

ఇక ఈ సినిమా లగాన్ పేరుతో రూపొంది విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగింది అని యాష్ పాల్ శర్మ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఇకపోతే. ఈ సినిమా 2001 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: