మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని తాప్సి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సొట్ట బుగ్గల సుందరి మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఈ నటి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అలా కెరియర్ సాఫీగా ముందుకు సాగుతున్న సమయం లోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఈమె హిందీ సినిమాలలో నటించడం , ఈమె నటించిన చాలా హిందీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంది. ఇక ప్రస్తుతం ఈమె హిందీలో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , వైవిద్యమైన సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే తాప్సి అప్పుడప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె నేను నటిని పబ్లిక్ ప్రాపర్టీని కాదు ... అంటూ గట్టి స్టేట్మెంట్లు ఇచ్చింది.

ఇక తాజాగా తాప్సి ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా తాప్సి చేతిలో అనేక హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న తాప్సి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో నటించడం లేదు. ఆఖరుగా ఈ బ్యూటీ మిషన్ ఇంపాజిబుల్ అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో నటించలేదు. ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: