మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇటీవల జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ రిపోర్టులో తెలియజేస్తూ చాలామంది మహిళలు దిగ్భ్రాంతిక విషయాలను కూడా తెలియజేశారట. ముఖ్యంగా మహిళలు క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని జస్టిస్ హేమ కమిటీ వీటిలో పేర్కొంది. ఇలాంటి సమయంలోనే మలయాళ నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు అయినా సిద్ధిఖీ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.


దీంట్లో మరొకసారి మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నది. ఈమె చేసిన వ్యాఖ్యలతో సిద్ధిఖి మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నారట. ఇన్నాళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న ఈయన తన పదవికి రాజీనామా చేసినట్లుగా తన లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్కు సైతం అందించారు. 2019లో సిద్ధిఖి పైన నటి రేవతి పలు రకాల ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్లీ జస్టిస్ హేమ కమిటీ నివేదికలో రాగానే మరొకసారి నటుడు సిద్ధిఖి పైన సంచలన కామెంట్స్ చేసింది.


2016లో సిద్ధికి నటించిన సుఖమరిమతే  అనే సినిమా తిరువనంతపురంలో నీలా థియేటర్లో ఆడిందట.అయితే ఈ సినిమా ప్రిOవ్యూ తర్వాత అతడు తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది. తన కుమారుడు నటించబోయే సినిమాలో ఆఫర్ గురించి మాట్లాడేందుకు సైతం సిద్ధిఖి తనను సంప్రదించారని.. తనని కూతురు అని పిలిచేవారని ఆ సమయంలో అనుమానం రాలేదు కానీ ఆ తర్వాతే తనపై ఇలా లైంగిక దాడి చేశారు అంటూ ఆమె ఆరోపిస్తోంది. తనని మస్కట్ హోటల్కు తీసుకువెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలియజేసింది రేవతి. అలాగే తను ఎదురు తిరిగినందుకు తనపైన దాడి చేయించారని హోటల్ గదిలో చాలా బిక్కుబిక్కుమంటూ నరకాన్ని సైతం చూశాను అంటూ తెలియజేసింది రేవతి. ఆ భయంకరమైన సంఘటన ఇప్పటికి తనను భయభ్రాంతులకు గురిచేస్తోంది అంటూ తెలిపారు. సిద్ధిఖి ఒక నీచమైన నటుడు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: