చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్రసేనమా ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీస్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే ఇకపోతే రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దక్కాయి ఇక రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్ భారీగా డ్రాప్ అయ్యాయి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి రీ రిలీజ్ లో భాగంగా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది దానితో రెండు రోజుల్లో కలిపి ఇంద్ర మూవీకి రీ రిలీజ్ లో భాగంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 1.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 32 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 61 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.08 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 2 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 43 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 72 లక్షల కలెక్షన్లు దక్కాయి. టోటల్ గా ఈ మూవీ కి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.23 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా రెండు రోజుల్లో భాగంగా ఇంద్ర సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించగా ... పరుచూరి గోపాలకృష్ణ మాటలు అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: