కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్ర లలో నటించి ప్రస్తుతం హీరోగా ఫుల్ జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో సుహాస్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించాడు . అలా కెరియర్ ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈయన కలర్ ఫోటో అనే సినిమా లో హీరోగా నటించాడు . ఈ మూవీ థియేటర్ల లో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది . ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడం తో ఈ మూవీ ద్వారా ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది . ఆ తర్వాత వరుస సినిమాలలో సుహాస్ కి హీరో గా అవకాశాలు దక్కుతున్నాయి.

ఇకపోతే కలర్ ఫోటో సినిమా తర్వాత ఈయన పలు సినిమాలలో హీరో గా నటించాడు. ఈయన హీరో గా నటించిన చాలా వరకు సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా సుహాస్ "జనక అయితే గనక" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇకపోతే తాజాగా సుహాస్ ఈ సినిమాను చూసినట్లు తెలుస్తోంది.

చూశాక ఈ సినిమా అద్భుతంగా ఉంది , కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా యొక్క "యు ఎస్ ఏ" హక్కులను ఈ హీరో సొంతంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా హీరోనే ఈ సినిమా యొక్క హక్కులను దక్కించుకున్నాడు అంటే ఈ మూవీ కచ్చితంగా బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: