ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీస్ అవుతున్న సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి. అలాగే రీ రిలీజ్ లో భాగంగా కొన్ని సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి. ఇకపోతే ఎక్కువ శాతం రీ రిలీజ్ లో యంగ్ స్టార్ హీరోలకు సంబంధించినవి జరుగుతున్నాయి. వారి సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు అద్భుతమైన కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి. కానీ సీనియర్ స్టార్ హీరోల విషయంలో , యంగ్ స్టార్ హీరోలకు వచ్చిన స్థాయి కలెక్షన్లు రావడం లేదు.

కాకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్నకేశవ రెడ్డి , చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రీ రిలీజ్ లో వచ్చాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టినవ్రోజు సందర్భంగా ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. కొన్ని ఏరియాలలో యంగ్ హీరోలకు కూడా సాధ్యం కానీ కలెక్షన్లను ఇంద్ర మూవీ వసూలు చేసింది. సీనియర్ స్టార్ హీరోల విషయంలో ఇంద్ర సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించింది.

ఇక ఈ సంవత్సరం నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి మాస్ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఇంద్ర సినిమా రీ రిలీస్ లో భాగంగా కలెక్ట్ చేసిన కలెక్షన్లను మించి వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. మరి మాస్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: