టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వివి వినాయక్. 2002లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వినాయక్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు వినాయక్. వినాయక్ వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేశాడు. బాలయ్య బాబుతో చెన్నకేశవ రెడ్డి, యంగ్ హీరో నితిన్ తో దిల్, మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మెప్పించారు. అయితే ఇప్పుడు వినాయక్ కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.వినాయక్ కు అనారోగ్య సమస్య ఎదురైందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ లో ఇబ్బందులు రావడంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారు అని టాక్ వినిపిస్తుంది. చివరిగా వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి సినిమా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇంతవరకు వివి వినాయక్ తెలుగు సినిమాను అనౌన్స్ చేయలేదు. దానికి కూడా అనారోగ్య సమస్యే కారణం అని అంటున్నారు. దాంతో వినాయక్ శారీరకంగానూ తగ్గిపోయారని అంటున్నారు.వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగింది. కాలేయానికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.ఇదిలావుండగా దర్శకుడు వివి వినాయక ఆరోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారంపై సన్నిహిత వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం అయిన పూర్తి ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆయన హెల్త్ విషయమే ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరాయి. అంతకుముందు ఆయన అనారోగ్యం పాలయ్యారని లివర్ సర్జరీ జరిగిందని వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: