మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా రామ్ చరణ్ చేస్తున్న తదుపరి చిత్రాలపై ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నారు చరణ్. ఇక ఈ విషయం పక్కన పెడితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ

 డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ అతన్ని ఏపీ సీఎంగా చూడాలని అనుకున్నారు. కానీ డిప్యుటీ సీఎం హోదాలో ఇప్పుడు కొనసాగుతున్నారు.  ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువగా అప్పులు చేసారంట. అయితే ఆయన అప్పులు చేసింది ఎవరి దగ్గరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర. గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలని వారు గుర్తు చేసుకున్నారు. తనకు అవసరం అనుకుంటే ఎవరి దగ్గర అయిన డబ్బులు తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్

 ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే చిన్న వయస్సులో మా వదినని డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా అనిపించేది. అందుకే రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఉంటే వడ్డీతో సహా ఇస్తానని తీసుకునేవాడిని అలా చరణ్ దగ్గర నేను చాలా అప్పు చేసాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చరణ్ దగ్గర పాకెట్ మనీ ఉంటే దానినే అప్పుగా తీసుకునేవాడినని పవన్ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ తమ్ముడైన ఒక కొడుకు క్రిందనే చూసుకునేవాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: