కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ ఇటీవల రాయన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం కూడా వహించాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం సక్సెస్ సాధించడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, జయరామ్, కాళిదాస్, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, ఎస్.జే. సూర్య, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్ లు కీలక పాత్రల్లో

 నటించారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఏకంగా 156 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాయన్ సొంతం చేసుకుంది. ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రాయన్ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే కరోనా తర్వాత 2021 నుంచి ఇప్పటి వరకు ధనుష్ 10 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కోవిడ్ తర్వాత ధనుష్ నుంచి వచ్చిన మొదటి సినిమా కర్ణన్ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. 25 కోట్లతో నిర్మించిన ఈ మూవీ లాంగ్ రన్ లో 67 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2021లో తమిళంలో హైయెస్ట్ గ్రాస్ చిత్రాలలో ఇది ఒకటి. తరువాత హాలీవుడ్ మూవీ ది గ్రే మెన్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పెద్దగా

 మెప్పించలేదు. తిరుచిత్రంబలం సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సింపుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కి ఏకంగా 117 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దీని తరువాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన నాన్ వరువేన్ మూవీ డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ తెలుగులో తెరకెక్కిన సార్ మూవీ ఏకంగా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా మూవీ సూపర్ సక్సెస్ ని అందుకుంది. గత ఏడాది ఆఖరులో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీ ఓవర్ బడ్జెట్ కారణంగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయితే లాంగ్ రన్ లో ఈ మూవీ 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: