ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా కథపై పూర్తి నమ్మకం ఉందని నటుడు సుహాస్ చెబుతున్నాడు. అంతేగాక, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు

 సంబంధించిన యూఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని కూడా సుహాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ బుల్గనిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో హీరో సుహాస్ డిస్టిబ్యూటర్ గా మారబోతున్నాడంట. యూఎస్ రిలీజ్ రైట్స్ ని సుహాస్ దిల్ రాజు నుంచి తీసుకున్నారంట. తాజాగా మూవీ ఈవెంట్ లో సుహాస్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే కెరియర్ ఆరంభంలోనే ఇలా డిస్టిబ్యూటర్ గా అవతారం ఎత్తడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అనే మాట వినిపిస్తోంది.

 అయితే సుహాస్ కి యాక్టింగ్ అనేది ఇష్టమైన పని. తనని తాను స్టార్ యాక్టర్ గా రిప్రజెంట్ చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోడు. అందుకే ఈ సినిమా కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. జనక అయితే గనక మూవీ తర్వాత సుహాస్ చేతిలో హీరోగా మరో మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అలాగే ఓ మూవీలో క్యామియో రోల్ చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: