తాప్సి మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక రాఘవేంద్రరావు సినిమా అంటే హీరోయిన్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో చెప్పనక్కర్లేదు. అలా ఝుమ్మంది నాదం సినిమాలో తాప్సీ తన అందాలు ఆరబోసింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అయితే తాప్సీ చేసిన తప్పేంటంటే..కొంతమంది హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేయడమే. దాంతో ఈమె క్రేజ్ టాలీవుడ్ లో తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.ఇక సౌత్ లో ఎన్ని సినిమాల్లో చేసినా కూడా తాప్సికి అంత స్టార్డం రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపు లభించింది.దాంతో బాలీవుడ్ కే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి తాప్సి ఈ ఏడాది మతియాస్ బోని పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాప్సిపై గతంలో కొన్ని రూమర్స్ అయితే నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.. 

అందులో ఒకటి తాప్సీ మనోజ్ ని ప్రేమించిందని. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని మనోజ్,తాప్సీ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.ఇక మరో హీరోతో తాప్సి అప్పట్లో ప్రేమాయణం నడిపించిందనే టాక్ వినిపించింది. ఇక ఆ హీరో ఎవరో కాదు. స్టార్ దర్శకుడిగా తెలుగులో గుర్తింపు ఉన్న రవి రాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి.. కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన ఆది పినిశెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా స్థిరపడిపోయారు.అయితే ఈయన నిక్కీ గల్రాని అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ఇక నిక్కకీ గల్రాని కంటే ముందు ఆది పినిశెట్టి తాప్సి ఇద్దరు ప్రేమలో పడిపోయారు అనే టాక్ వినిపించింది.దానికి ప్రధాన కారణం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గుండెల్లో గోదారి అనే సినిమా..

ఈ సినిమాలో ఆది పినిశెట్టి తాప్సి ఇద్దరు రోమాంటిక్ సన్నివేశంలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో ఈ విషయం తెలిసిన డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి తాప్సికి వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు ఆది పినిశెట్టి కి కూడా పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చి ముందు సినిమాలపై దృష్టి పెట్టు ప్రేమ కాదు అని చెప్పేసరికి తండ్రికి భయపడి పోయిన ఆది పినిశెట్టి తాప్సికి దూరంగా ఉన్నారట. ఇక తాప్సి కూడా అప్పుడే ఇండస్ట్రీకి రావడంతో స్టార్ డైరెక్టర్ వార్నింగ్ తో తనకి ఎక్కడ సినిమా అవకాశాలు తగ్గిపోతాయోనని భయపడి ఆదికి దూరంగా ఉందని అప్పట్లో టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: