నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఇంతకు ముందు నానితో అంటే సుందరానికి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దానయ్య బ్యానర్‌ నుండి వస్తున్న చిత్రమిది. పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత డీవీవీ దానయ్య ఓజి చిత్రం గురించి ప్రస్తావించారు. అభిమానులు ఓజి…ఓజి…ఓజి అని అంటూ ఉండగా, “మొన్న మీ తరపున నాని గారు ప్రెస్ మీట్ లో అడిగేశారు. వెయిట్ చెయ్యండి. త్వరలోనే వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నాని నటించిన "సరిపోదా శనివారం"సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజి ఫ్యాన్స్ హోరేత్తించారు.నిర్మాత డీవీవీ దానయ్య పై రూపొందించిన ఏవి లో ఓజి గ్లింప్స్ ప్లే చేయగా, పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనపడగానే ఫ్యాన్స్ అరుపులతో అదరగొట్టారు. రోజురోజుకి ఈ మూవీ పై హైప్ పెరిగిపోతుందంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

త్వరలోనే పవర్ స్టార్ తో షూటింగ్ మళ్ళీ మొదలుపెడతామని ఇటీవల ప్రొడ్యూసర్ చెప్పిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది. ఈ క్రమంలో ఆరోజున ‘ఓజి’ నుంచి రాబోతున్న అప్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సహజంగా మూవీకి సంబంధించిన అప్ డేట్ అంటే.. పోస్టర్ , లిరికల్ సాంగ్ లేదా మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారు. దేనిని రిలీజ్ చేస్తున్నాం అనే దాని గురించి ముందే అప్ డేట్ ఇస్తారు. కానీ ‘ఓజి’ మూవీ విషయంలో మాత్రం ఇక్కడ ఓ చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన పై మూడింటిని రెడీ చేశారు. కానీ బర్త్ డే రోజున దేనిని రివీల్ చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు హీరో మాట్లాడుకుని ఎదో ఒక దానిని మాత్రమే రివీల్ చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఆ అప్ డేట్ ఏంటో తెలియాలంటే అప్పటివరకు ఎదురుచూపులు తప్పవు.ఓజి సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు.. చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ మూవీ విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఓ వైపు ఓజి అప్ డేట్ కోసం ఎదురుచూస్తూనే.. గబ్బర్ సింగ్ రీరిలీజ్ కు కూడా అదే రేంజ్ లో సెలెబ్రేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. మరి ఈ రీరిలీజ్ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో.. ఓజి నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: