నాని నటించిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి కమెడియన్ ఆలీ హాజరయ్యారు. కాగా.. ఒక ఆసక్తికర సన్నివేశం ఏర్పడింది. ఆలీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ వింటే.. ఆయన పవన్ కల్యాణ్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎర్ర కండువా చూపించిన ఆలీ.. దాని పవర్ గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఆయన ఏమన్నారంటే?'సరిపోదా శనివారం' ఈవెంట్ కి వచ్చిన ఆలీకి సుమ మూడు వస్తువులు చూపించింది. దాంట్లో ఆలీ ఎర్ర కండువాను తీసుకున్నారు. ఆ కండువా తీసుకున్న చేతిలో పట్టుకున్న ఆలీ దీనికి చాలా పవర్ ఉందని, ఇది చాలా పవర్ ఫుల్ ఈ రంగుకి ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు. అ.. అ.. అంటూ పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ ఆయనదే ఇది. అన్ని చెప్పారు. దీంతో ఆడియెన్స్ అందరూ ఒక్కసారిగా కేకలు పెట్టారు. "ఈ పవర్ ఏంటో వాళ్లందరికి కూడా తెలుసు. ఈ రంగు రక్తం ఒంట్లో ప్రవహిస్తుంటే కోపం ఉంటుంది. కానీ, అది ఎప్పుడు ఉపయోగిస్తామంటే అవతలి వాళ్లు మనల్ని కెలికితే.. అప్పుడు ఉపయోగిస్తాం. ఇది చాలా పవర్ ఫుల్ కాబట్టి ఈ క్లాత్ నానికి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు ఆలీ. అంతేకాకుండా ఓజీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని అన్నారు ఆలీ.

ఎర్ర రంగు అంటే పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి చిహ్నం అని అందరికీ తెలిసిందే. పవన్ కల్యాన్, పవన్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఎర్ర రంగు టవల్ ని పట్టుకుని ఉంటారు ఎప్పుడూ. ఇక ఇప్పుడు ఆలీ దాని గురించి మాట్లాడటం, చాలా పవర్ ఫుల్ అని చెప్పడంతో ఆయన పరోక్షంగా పవన్ కల్యాణ్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు ఆయన ఫ్యాన్స్. అంతేకాకుండా తను ఓజీ సినిమాలో కూడా ఉన్నట్లు ప్రకటించారు ఆలీ. దీంతో పవన్, ఆలీ కలిసిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి.ఆలీ, పవన్ కల్యాణ్ ఇద్దరూ సినిమాల పరంగా చాలా క్లోజ్. దాదాపు పవన్ అన్ని సినిమాల్లో ఆలీ ఉంటాడు. అయితే, రాజకీయాల వల్ల ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. ఆలీ వైసీపీలో ఉండటం. పవన్ కల్యాణ్ జనసేనలో ఉండటం, కొన్ని అనుచిత కామెంట్స్ చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ, ఆలీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. తను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆయన ఎర్రకండువా గురించి మాట్లాడటం అందరిలో ఆసక్తిరేపుతోంది. ఆలీ చేసిన ఈ కామెంట్స్ ని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. "అయ్యిందేదో అయిపోయింది. నువ్వు అతి చనువు ఇచ్చిన ఒకప్పటి నీ స్నేహితుడు.. నిజమెరిగినట్టున్నాడు.. క్షమించేయరాదు అన్న" అని కొంతమంది కామెంట్లు పెడుతుంటూ.. "కష్టంలో మనతో ఉన్నవాడు నిజమైన స్నేహితుడు అన్న, గెలుపు తర్వాత నీతో ఉంటాను అంటున్నాడు నమ్మొద్దు" అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నాడు. "ఏదేమైనా ఆలీ అలా మాట్లాడుతుంటే భలే ఉంది.. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాడు" అని ఇంకొంతమంది అంటున్నారు. చూడాలి మరి ఈ కామెంట్స్ ఫ్యూచర్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: