కాజల్ అగర్వాల్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కలువ కళ్లతో , వైట్ స్కిన్‌టోన్‌తో, మెస్మరైజ్ చేసే చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె జీవితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో మలుపు తిరిగింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అనతికాలంలోనే తెలుగులో అగ్రకథానాయికగా ఎదిగారు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరి ఛాయిస్ కాజలే అయ్యారంటే ఆమె టాలెంట్ అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోకి ఎన్ని కొత్త అందాలు వచ్చినా కొన్నేళ్ల పాటు కాజల్ హవానే నడిచిందంటే అతిశయోక్తి కాదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ కాజల్ తన సత్తా చాటారు.కాజల్ తన కెరియర్ ను మొదలుపెట్టి 20 ఏళ్లు అయింది. తెలుగు .. తమిళ భాషల్లో ఒకే సమయంలో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక్కడా .. అక్కడా కూడా ఆమె సీనియర్ స్టార్ హీరోలతో సైతం ఆడిపాడటం విశేషం. అలాంటి కాజల్ ఇప్పుడు కూడా తన జోరును కొనసాగిస్తూనే ఉంది. 'ఇండియన్ 2' .. 'సత్యభామ','భగవంత్ కేసరి సినిమాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కాజల్ హీరోయిన్ గా తన జోరు కొనసాగుతున్న సమయంలోనే 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి 'నేను పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఆ సాంగ్ అటు యూత్ ను .. ఇటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చాలా ఫంక్షన్స్ లో ఆ పాట వినిపిస్తూ ఉంటుంది..అయితే ఈ పాటలో కాజల్ అగర్వాల్ డాన్స్ కి గ్లామర్ కి ఫిదా అయినా ఓ తమిళ ప్రొడ్యూసర్ ఆమె దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు రాబోయే నా నెక్స్ట్ సినిమాలో మరింత స్కిన్ షో చేసి మరింత హాట్ గా గ్లామర్ గా నటించమని చెప్పారట.కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదట. అలాగే జనతా గ్యారేజ్ మూవీలో పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ లో చేయడానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నేను ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేశాను. కానీ అన్ని అలాంటి పాత్రలే చేస్తాను అని చెప్పడం లేదు. కేవలం ఆ సినిమాలో ఎన్టీఆర్ కోసమే స్పెషల్ సాంగ్ చేశాను.. మీరు చెప్పే పాత్రల్లో నటించడం నావల్ల కాదు. అన్ని అలాంటి పాత్రలే చేస్తే నాకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావు.మంచి మంచి సినిమాలు మిస్ అవుతాను. నేను అందులో నటించను అని ఆ తమిళ ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పిందట కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: