గ్లోబర్ స్టార్ ప్రభాస్‌  లీడ్ రోల్‌లో నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కాగా ఇప్పుడు ఓటీటీ లవర్స్‌ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సందడి చేస్తోంది. కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్‌ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీ వెర్షన్‌లో మాత్రం కొన్ని సన్నివేశాలను ట్రిమ్‌ చేశారు.

ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, మాళవికా నాయర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు ధనుష్ చిత్రానికి పోలికేంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద

 ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కల్కి స్ట్రీమింగ్ అవుతోంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 23న అదే ప్లాట్ఫారంలో ధనుష్ నటించిన రాయన్ చిత్రం కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ అవుతున్న చిత్రాలను అమెజాన్ ప్రైమ్ క్రమం తప్పకుండా తమ టాప్ లిస్టులో పెట్టి ప్రేక్షకులను ఊరిస్తారు. అయితే అందులో ధనుష్ చిత్రం మొదటి స్థానంలో ఉండడం..కల్కి రెండవ ప్లేస్‌లో ఉండడం మరొక ఆన్లైన్ వివాదానికి తెర లేపుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: