మాధాపూర్ పరిధిలోని టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను ఈ రోజు ఉదయం హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. నిన్న ఉదయం  మొదలు పెట్టిన ఈ కూల్చివేతలు నాలుగు గంటలపాటు సాగాయి. పెద్ద సంఖ్యలో పోలీసుల బందోబస్తుతో ఈ కూల్చివేతలు జరిగాయి. ఒక వైపు కూల్చివేతలు జరుగుతుండగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అప్పటికే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం

 నేలమట్టమైపోయింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై నాగార్జున తొలుత స్పందిస్తూ.. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కోర్టులో కేసులు ఉండగా.. స్టే ఆర్డర్లు ఉండగా ఇలా చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరంగా ఉన్నదని  చేశారు. తన రెప్యుటేషన్‌ను కాపాడుకోవడానికి అలాగే.. తాము ఎలాంటి ఆక్రమణలు చేయలేదనే విషయాన్ని స్పష్టం చేయడానికి తాను ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలని భావిస్తున్నానని పేర్కొన్నారు.  అయితేఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత.. నాగార్జునకి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. కూల్చేయడం వల్ల ఎంత నష్టం లాంటి అంశాలు వైరల్

 అవుతున్నాయి. వినిపిస్తున్న అంచనా ప్రకారం ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్లు అని తెలుస్తోంది.  ఈ ఫంక్షన్ హాల్ ని ఉపయోగించుకోవడానికి కోట్లల్లో ఖర్చు అవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్. కూల్చివేత వల్ల వందల కోట్లల్లో నష్టం వాటిల్లిందని అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేత చట్ట విరుద్ధం అని అన్నారు.  మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు.. నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: