టాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి  ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో రూప కొడువాయూర్ హిరోయిన్ గా నటిస్తుంది. కాగా నేడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు "సారంగపాణి జాతకం"  అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనితో పాటు ప్రియదర్శికి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఆ పోస్టర్ చూస్తుంటే ప్రియదర్శిని  జాతకాలు చెప్పే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తూంది. ఇకపోతే ప్రియదర్శి పుట్టిన రోజు

 సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం విశేషం. విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అర్థమవుతుంది. ప్రియదర్శి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన సినిమాలో కొత్తగా ప్రయత్నిస్తున్న పాత్ర అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 'సారంగపాణి జాతకం' సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుందో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ప్రియదర్శి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు. ఆయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

 ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ప్రియదర్శి ఫ్యాన్స్ ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ సినిమాపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అతని కొత్త సినిమా విడుదలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. శ్రీదేవి మూవీస్ సంస్థలో రూపొందుతోన్నటాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి  ప్రియదర్శి కాంబోలో ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: