నేచురల్ యాక్టింగ్ తో ఎంతో మందిని ఫిదా చేసిన ఫిదా బ్యూటీ సాయి పల్లవి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.. ఈమె నటనకి స్టార్ హీరోలు సైతం దాసులయ్యారు.. అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎంతోమంది హీరోలను కూడా తన యాక్టింగ్ తో పడగొట్టింది. ఇక కొంతమంది హీరోలు అయితే తన పక్కన నటించడానికే భయపడిపోతుంటారట. ఎందుకంటే సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ ముందు మేము తేలిపోతామా ఏంటి అనే భయం వారిలో ఉంటుందట.. ఇక సాయి పల్లవి నటన చూస్తే ఒకప్పటి సావిత్రి, సౌందర్యాలు గుర్తుకు వస్తారని ఈమె అభిమానులు పొగుడుతూ ఉంటారు.ఇక నటనలోనే కాదు అందచందాలలోను వారికి ఏమాత్రం తీసిపోదు.అలాగే డబ్బులు వస్తున్నాయి కదా ఏ పాత్ర అయితే ఏంటి చేసేద్దాం అనే విధంగా సాయి పల్లవి ఆలోచించదు.తన పాత్రకి ప్రాధాన్యం ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలు అయితే సాయి పల్లవి వల్లే హిట్ అయినవి కూడా ఉన్నాయి.. 

అలాంటి ఈ ముద్దుగుమ్మ మంచి డాన్సర్ కూడా..ఏదైనా ఈవెంట్ కి సాయి పల్లవి వస్తే ఆమె అభిమానులు కచ్చితంగా ఒక చిన్న బిట్ కి డాన్స్ చేయమని కోరుకుంటూ ఉంటారు.. ఇక సినిమాల్లో స్టార్ హీరోలు సైతం ఈమె డాన్స్ ముందు అప్పుడప్పుడు తేలిపోతూ ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఓ వైపు డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. అలా సినిమాల్లో స్టారే.. నిజ జీవితంలో కూడా స్టారే.. ఇక తనకి అవకాశాలు లేక ఏదైనా తనకి ఇష్టం లేని పాత్రలో నటించాల్సి వస్తే నటనకి స్వస్తి చెప్పి తనకి ఎంతో ఇష్టమైన డాక్టర్ వృత్తిలో స్థిరపడి పేదవారికి వైద్యం చేస్తానని ఎన్నోసార్లు సాయిపల్లవి చెప్పుకొచ్చింది.ఇక ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోయిన్ లలా కాకుండా సాయి పల్లవి చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఆ హీరో అంటే ఎంతో ఇష్టమట. అయితే ఆ హీరో కి పెళ్లి అయినా పర్వాలేదు .తనే నా ఫస్ట్ క్రష్ అంటుంది సాయి పల్లవి. మరి సాయి పల్లవి మెచ్చిన ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు సూర్య.. కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూర్య తన ఫస్ట్ క్రష్ అని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక సూర్యకి జ్యోతిక తో పెళ్లి అయినా కూడా ఆయనే నా ఫస్ట్ క్రష్ అని సాయి పల్లవి చెప్పింది.అంతే కాదు ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే తన ఫస్ట్ క్రష్ అయినటువంటి సూర్యతో నటిస్తాను అని ఎప్పుడూ కూడా అనుకోలేదని సాయి పల్లవి చాలా ఎక్జైటింగ్ గా చెప్పింది. ఇక సాయి పల్లవి సూర్యతో కలిసి ఎన్జికే మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: