యంగ్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 25ఆగష్టు 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, విపరీతమైన స్వాతంత్ర్య ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం ఉన్న మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ లో తన జూనియర్ ప్రీతి శెట్టి (షాలిని పాండే) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. అలా ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరైన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు.కానీ ప్రీతి తండ్రి వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రీతిని వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దాంతో మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ రెడ్డిని ఇంట్లోంచి బయటికొచ్చేసి, అన్ని చెడు అలవాట్లకు బానిసై రోజు రోజుకి కుంగిపోతుంటాడు. అలాంటి సమయంలోనే అతను అమితంగా ప్రేమించే డాక్టర్ వృత్తిని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అర్జున్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి ? అతని ప్రవర్తన ఎలా ఉండేది ? డాక్టర్ వృత్తిని అతనెందుకు కోల్పోవాల్సి వచ్చింది ? చివరికి అతని స్వచ్ఛమైన ప్రేమ గెలిచిందా లేదా ? అనేదే ఈ సినిమా.

ఈ సినిమాకు దర్శకుడు, రచయిత సందీప్ రెడ్డి వంగ విఫల ప్రేమికుడి జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి రాసుకున్న కథ, కథనాలు చాలా వరకు ఆకట్టుకోగా బలమైన హీరో పాత్ర, సన్నివేశాలు చాలా రోజులపాటు గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి.సంగీత దర్శకుడు రాధన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం బాగున్నాయి. రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్టింగ్ అనేదే లేకుండా ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించడంతో సినిమాకు సహజత్వం కలిగింది. శశాంక్ తన ఎడిటింగ్ ద్వారా అక్కడక్కడా ఉన్న కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించాల్సింది. సంజయ్ రెడ్డి వంగ నిర్మాణ విలువలు చాలా బాగా చూపించారు.ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి నేటితో ఏడేళ్లు పూర్తయింది.దీనిపై హీరో విజయ్ దేవరకొండ ఎక్స్ లో స్పందించారు.ఈ మూవీకి ఏడేళ్లు పూర్తయ్యా అంటే  నమ్మలేకపోతున్నా గత ఏడాది జరిగినట్లుగానే అనిపిస్తుంది.పదవ వార్షికోత్సవానికి అర్జున్ రెడ్డి ఫుల్ కట్ ని ప్రజలకు చూపాలని డైరెక్ట్ సందీప్ రెడ్డిని కోరుతున్నా అని రాసుకొచ్చారు.ఈ చిత్రం ఒరిజినల్ రన్ టైం 220 నిమిషాల పైనే ఉండగా 182 రిలీజ్ అయింది.అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: