సుశాంత్ రాజ్‌పుత్ మరణించిన కొంతకాలానికి కూడా ఆమె కాంట్రవర్షల్ కామెంట్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ కారణంగా ప్రతిభావంతులైన నటులు మగ్గిపోవాల్సి వస్తుందని నటి రవీనా టాండన్ అప్పట్లో వ్యాఖ్యానించింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యాక్టర్లకే ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ లేని నటులు మాట వినకపోతే వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కి వేస్తారని కూడా ఆమె కామెంట్స్ చేయండి.
రవీనా ప్రకారం మంచిగా నటిస్తే ఈయనకు లేదా ఈవిడకు పొగరు, బిహేవియర్ బాగోలేదు అంటూ ప్రచారం చేస్తారట. అంతేకాదు తమకు అనుకూలమైన పేపర్లలో వీరి గురించి తప్పుడు వార్తలు రాయించి ఈరోజు సాటిస్ఫై చేసుకుంటారని ఆమె తెలిపింది. క్యారెక్టర్ డామేజ్ చేయడానికి వేరు ఎంత దూరానికైనా వెళ్తారని ఆమె తెలిపింది. తన కెరీర్ ను నాశనం చేయాలని కూడా చాలా మంది అనేక విధాలుగా కుట్రలు పన్నారని రవీనా టాండన్ ఇంటర్వ్యూల్లో తెలిపింది.
రవీనా టాండన్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'బంగారు బుల్లోడు' సినిమాతో తెలుగువారిని అలరించింది దాని తర్వాత కూడా ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆపై వేరే ఇండస్ట్రీ లోకి వెళ్లిపోయింది. 2023లో రవీనాకు కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రవీనా టాండన్ తండ్రి ఓ నిర్మాత. ఆయన పేరు రవి టాండన్. సల్మాన్ మూవీ 'పత్తర్ కే ఫూల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.