సాధారణంగా థియేటర్లలో ప్లాప్ అయినా సినిమాలు ఓటీటీలో మాత్రం బాగానే ఆడుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం ఈ సీన్ రివర్స్ అవుతుంది. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. ఇటీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ సినిమా అయిన "ముంజ్య". ఇప్పుడు ఇది ఇంట్లో కూర్చుని చూసే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లు దీని గురించి రకరకాలుగా అభిప్రాయాలు చెప్తున్నారు. ఈ మూవీ అసలు ఎలా హిట్ అవుతుందో తెలియడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

సినిమా కథ ఏంటంటే, ఒక యువకుడు తన పుట్టిన ఊరు వెళ్తాడు. అక్కడ తన కుటుంబానికి సంబంధించిన ఒక రహస్యం తెలుసుకుంటాడు. అంతేకాదు, "ముంజ్య" అనే కోపం గల దెయ్యం కూడా అతనికి కనిపిస్తుంది. ఆ దెయ్యం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఆ తర్వాత ఆ యువకుడు ముంజ్య దెయ్యం నుంచి తననూ, తన ప్రేయసిని కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు చాలా ఫన్నీగా ఉంటాయి.

సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలోని కామెడీ బాగా నవ్విస్తుంది. ఇందులో కొన్ని భయానక దృశ్యాలు కూడా ఉన్నాయి. కానీ సినిమాలోని కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రం అంత బాగోలేవు. చాలా మందికి ఈ సినిమా బాగా నచ్చింది. చాలా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏం చూడొచ్చని పనులు మానుకొని చూడాల్సినంత గొప్ప కంటెంట్ దీంట్లో ఏమీ లేదని మరి కొంతమంది అంటున్నారు. ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యిందో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సినిమా కథ చాలా బాగుంది. కానీ సినిమా చివరి భాగం ఇంకా బాగుండాల్సింది. చివరి దృశ్యాలు అంత బాగా ఉండకపోయినా, సినిమా అలా అలా ముగిసింది. ఇది 'భేడియ' అనే మరో హారర్ కామెడీ సినిమా క్లైమాక్స్‌లా ఉంది. కానీ ఇప్పుడు చాలా మంది సినిమాలు థియేటర్‌లో హిట్ అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసినప్పుడు నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. సినిమా థియేటర్‌లో చూసినప్పుడు ఎలా ఉంటుందో, మొబైల్ స్క్రీన్‌లో చూసినప్పుడు అలా ఉండదు. థియేటర్‌లో చూసినప్పుడు సినిమా ఎంత బాగుంటుందో మనకు తెలియదు. ఏదేమైనా ఇది చాలా తక్కువ బడ్జెట్ కి విడుదలై వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott