సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన అల్లు అరవింద్  GA-2 పిక్చర్ కంటెంట్ ని బన్నీ వాసు మెయింటైన్ చేస్తూ ఉన్నారు.. మొదట భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, ట్యాక్సీవాలా ,గీతగోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన ఆయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నది. ఇందులో హీరోగా నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించడం జరిగింది. డైరెక్టర్ అంజి కే మణిపుత్ర ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.



సినిమా మీద తమకు చాలా నమ్మకం ఉందని GA -2 ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా సినిమా ఈవెంట్లో మాట్లాడడం జరిగింది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి హిట్టు టాక్ తెచ్చుకోవడంతో విడుదలైన 10 రోజులకు కూడా హౌస్ పూలతో ఫుల్ కలెక్షన్స్ తో ఆయ్ ఉన్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.25 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. కేవలం 3.50 కోట్ల టార్గెట్తో ఈ సినిమా బరిలోకి దిగింది.


అయితే ఈ సినిమా ఇప్పటివరకు 12.26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని చిత్ర బృందమే అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఆయ్ చిత్రం విడుదలైన అన్ని ఏరియాలలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్ని అయినా ఆదరిస్తారని మరొకసారి ఈ సినిమా ప్రూఫ్ చేసింది. ఇప్పటికే బడా సినిమాలు సైతం రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసుకోవడంతో ఈ సినిమాకి మరింత అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నేనితిన్ మంచి సక్సెస్ ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: